కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రణభేరి మొదలైంది.. సీఎం సొంత జిల్లా కావడంతో ఎన్నికల వేడి రసాభాసగా కొనసాగుతుంది. అధికార పార్టీ ఇతర పార్టీలకు పోటీ ఇస్తుంది. పంచాయితీ ఎన్నికల కూడా అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో ఈ ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయమని భావిస్తున్నారు. కడప పరిధిలో ఉన్న నియోజక వర్గాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. ప్రచారంలో జోరు పెరిగింది. రేపటితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నేతలు ఉదయం నుంచే ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా , వైసీపీ లో ఇంటి పోరు తప్పడం లేదు. ఎన్నికల్లో పోటీకి దిగిన చాలా మంది నిరాశలో ఉన్నారు.