పురపాలక ఎన్నికల వ్యవహారంలో వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈపాటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని, అవసరమైతే అధికారులు పక్కన ఉండగానే వాటిని వాడాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే సడన్ గా విశాఖలో వాలంటీర్ల సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వాలంటీర్లకు వైసీపీ నేతలు శిక్షణ ఇస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు వాలంటీర్లంతా రహస్యంగా కలవాల్సిన అవసరమేముందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.