చిన్నచిన్న కారణాలకే క్షణికావేశంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సౌదీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు పట్టపగలే రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారులోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది.