మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాపై మండి పడ్డారు. అవగాహన లేకుండా అసత్య ప్రచారాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలు తరలి వెళ్తున్నాయని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తే, వాటి ఆధారంగా కొన్ని పత్రికలు, ఛానెళ్లు అవే అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయని అన్నారు. వెళ్తున్నాయి, తరలి వెళ్తున్నాయి అంటూ దుష్ప్రచారం చేసిన ప్రతిసారీ.. నిజమేంటో, ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారని అన్నారు.