పేదలందరికీ ఇళ్లు ఇచ్చే పథకంలో భాగంగా ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయా స్థలాల్లో నిర్మాణాలు మొదలు పెట్టి వైఎస్సార్ జగనన్న కాలనీల ఏర్పాటుకి కృషిచేస్తోంది. అయితే ఆయా కాలనీల్లో నిర్మాణాలతోపాటే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. జగనన్న కాలనీల సమీపంలో జనతా బజార్ లు, ప్రతి కాలనీకి ఒక లైబ్రరీ సౌకర్యం కల్పించబోతున్నారు. తాజాగా నీటి వసతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.