విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోదని, నూటికి నూరుపాళ్లు జరిగే తీరుతుందని లోక్ సభలో కేంద్రం ప్రకటనతో కార్మికులు ఆందోళనబాట పట్టారు. ప్రైవేటీకరణ ఆపేందుకు తక్షణ కార్యాచరణ ప్రకటించారు. రాత్రికి రాత్రే హైవే దిగ్బంధంతో విశాఖ అట్టుడుకుతోంది. కేంద్రం వెనక్కి తగ్గాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ విశాఖలో కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.