సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు రెండు రోజుల ముందు.. అమరావతి ఆందోళనలు మిన్నంటాయి. అమరావతి రాజధానికోసం ఆందోళన చేస్తున్న రైతులు రోడ్డెక్కారు. వారి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసన కారుల్ని నెట్టిపడేస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా కనిపించాయి. రోడ్డుపైనే కూర్చుని విస్తర్లు కూడా లేకుండా భోజనాలు చేయడం కూడా అందరినీ కలచి వేసింది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ కి ఫలితం ఉంటుందా, రేపు బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేకత పెరుగుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.