ఏసీబీ దాడులంటే కేవలం అధికారులను మాత్రమే టార్గెట్ చేస్తారని తెలుసు. అయితే ఇటీవల తెలంగాణలో ఏసీబీ అధికారులు ప్రజా ప్రతినిధుల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను ఇలా దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. లంచం తీసుకుంటున్న సందర్భంలో.. సర్పంచులు, ఉప సర్పంచులేకాదు...సర్పంచుల భర్తలను కూడా అరెస్ట్ చేస్తోంది ఏసీబీ. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక సర్పంచి, మరో సర్పంచి భర్తను లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం విశేషం.