ఏపిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇప్పుడు నేతలు ప్రలోబాలకు దిగారు.. సోషల్ మీడియా లో, టీవీ లలో ప్రకటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పార్టీ పై మరొక పార్టీ విమర్శలు చేయడం ,లేదా తప్పుడు కథనాలతో ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జాతీయ మీడియా సంస్థ అయిన రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం కావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనం ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.