ఆంధ్ర ప్రదేశ్ లో పుర పాలక ఎన్నికలు రేపు జరగనున్నాయి.. నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి తెర పడింది .దీంతో నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం , నగదు పంపిణీ జరగకుండా పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న కూడా ఎలాగోలా ఓటర్లకు అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కడప జిల్లా ప్రొద్దుటూరు Cలో మాత్రం ఎన్నికలు సమస్యాత్మకంగా మారాయి. గెలుపు కోసం నేతలు పోరాడుతున్నారు. ఎవరికీ వారే అన్నట్లు పోటీ పడుతున్నారు. ఓటర్ల కోసం నోట్ల పడగలను విప్పుతున్నారు.