స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తుతం అన్ని పార్టీలు తమ తమ రాజకీయ లబ్ది మేరకు స్టాండ్ తీసుకుంటున్నాయి తప్ప... సమస్యకు అసలైన పరిష్కారాలను సూచించడం లేదన్న విమర్శ ఉంది. రాజకీయాలను పక్కకు పెట్టి.. రాజకీయ ప్రయోజనాలను పక్కకుపెట్టి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం అందరినీ కలుపుకుని వెళ్తే.. పరిష్కారానికి మార్గం దొరుకుతుంది.