తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో అర్ధరాత్రి ఓ మహిళపై దాడి జరిగింది. ఆ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. డబ్బు విషయంలో వచ్చిన వివాదం వల్లే ఆ మహిళపై దాడి చేశారని పోలీసులు తెలిపారు.