ఇకపై సెల్ ఫోన్లు కడపలో తయారు కాబోతున్నాయి. వీటికోసం డిక్సన్ టెక్నాలజీస్ అనే సంస్థ అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతోంది. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ యూనిట్ ఏర్పాటుకు డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ వస్తే 3వేలమందికి ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరింత మందికి ఉపయోగం ఉంటుంది. డిక్సన్ కంపెనీ రాకతో కొప్పర్తి క్లస్టర్ కు మరింత కళ వస్తుందని అంటున్నారు.