ఇటీవల కాలంలో అమరావతి ఉద్యమానికి కాస్త దూరంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు మళ్లీ.. రాజధాని అంశాన్ని భుజానికెత్తుకున్నారు. రాజధాని ప్రంతంలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా వెళ్లి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి మహిళలను అవమానించిన జగన్ కు, కౌరవ సభలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడికి పట్టిన గతే పడుతుందని అన్నారు. అయితే బెజవాడ ఎన్నికల కోసమే చంద్రబాబు అమరావతి వెళ్లాని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.