ఎన్నికలు అన్ని వరుసగా జరిపించాలని ఎన్నికల కమీషన్ ను ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.. జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు తప్ప మరో ఎన్నికలను జరిపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..పరిషత్ ఎన్నికల పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై తీర్పు రిజర్వు అయ్యింది. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించుకుని, ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇంకోవైపు... ఈనెల 19 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.