సరిగ్గా విశాఖ మున్సిపల్ ఎన్నికల ముందే.. ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం కుండబద్దలు కొట్టడం, నూటుకి నూరుశాతం ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర మంత్రి ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. బీజేపీ ఎలాగూ ప్రైవేటీకరణను సమర్థించుకుంటోంది కాబట్టి.. ఆ పార్టీకి ఓట్లు, సీట్లు గురించి పెద్దగా పట్టింపులేదు. అయితే విశాఖలో మైలేజీకోసం టీడీపీ, వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్కు పాపాన్ని ఒకరిపై ఒకరు నెట్టేసుకోడానికి తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు నేతలు.