తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఉద్యోగులకు భారీ తాయిలాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధం చేసేశారు. మెరుగైన ఫిట్ మెంట్ తో పీఆర్సీని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే.. ఫిట్ మెంట్ విషయంలో కేసీఆర్ ఉదారంగా ఉన్నారన్న వార్తలు రావడంతో ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు. ఈ దఫా 29శాతం ఫిట్ మెంట్ ఇస్తారని సమాచారం.