కరోనా వేళ ఫేస్ మాస్క్ విషయంలో ఇకపై కఠిన నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకూ విమాన ప్రయాణాల విషయంలో సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తే, ఇతర నిబంధనలు అతిక్రమిస్తే.. అలాంటి ప్రయాణికులపై కొన్ని నెలలపాటు, లేదా శాశ్వతంగా సదరు విమానయాన సంస్థ నిషేధం విధిస్తుంది. ఇప్పుడీ నిబంధన మాస్క్ విషయంలో కూడా అమలులోకి రాబోతోంది. మాస్క్ లేకుండా ఉండే అసలు ఎయిర్ పోర్ట్ లోకే ఎంట్రీ లేదు. ఒకవేళ మాస్క్ తో ఎయిర్ పోర్ట్ లోకి వచ్చి, పరిసరాల్లో దాన్ని తీసివేసి తిరిగినా, విమానంలో మాస్క్ సరిగ్గా ధరించకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది.