పోలవరం ప్రాజెక్ట్ పై మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ వరదలకు కొట్టుకుపోయిందంటూ ఈనాడులో వచ్చిన కథనాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తప్పులన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని తీవ్రంగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు టైమ్ లో జరిగిన తప్పులకు తమనెందుకు బాధ్యులుగా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.