ఎక్కడైనా విలువైన వస్తువుల కోసం కొట్టుకోవడం చూసి ఉంటారు.. లేదా ఏదైనా లాభాలు వస్తున్నాయకుంటే ఒకరిపై మరొకరు మాటల యుద్ధం నుంచి రక్తాలు కారేవరకు కొట్టుకోవడం సహజం. ఎక్కడైనా కూరగాయల కోసం కొట్టుకోవడం చూసారా.. అది కూడా టమోటాల కోసం. గంపెడు టమాటాల కోసం ఓ దేశం రెండు గ్రూప్ లుగా మారి దారుణంగా కొట్టుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజమని చెప్పాలి...కేవలం గంపెడు టమాటల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతున్నది. ఈ ఘర్షణల్లో ఇప్పటిదాకా 20 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.