ముఖ్యమంత్రిపై దాడి జరగడం అంటే సామాన్య విషయం కాదు. సాక్షాత్తూ ఆ ముఖ్యమంత్రే ఆ దాడిని ఓ కుట్రగా అభివర్ణించడం ఇంకా పెద్ద సంచలనం. పశ్చిమబెంగాల్ లో అదే జరిగింది. సీఎం మమతా బెనర్జీ తనపై దాడి జరిగిందని, దాని వెనక కుట్ర ఉందని ఆరోపించింది. నందిగ్రామ్ లో నామినేషన్ వేసి తిరిగి వెళ్తున్న క్రమంలో తనపై దాడి జరిగిందని ఆరోపించారు మమతా బెనర్జీ. ప్రస్తుతం ఆమె కోల్ కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.