మంగ్లి గొంతు సారంగదరియా పాటను ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. కోమలి పాడితే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ఇప్పటికే పాపులర్ అయిన మంగ్లి తన వాయిస్ తో పాటకు ప్రాణం పోసిందని చెప్పాలి. అదే సమయంలో ఆమెను సెకండ్ ఆప్షన్ గా దర్శకుడు, రచయిత పేర్కొనడం మరో వివాదానికి దారి తీస్తోంది. అయితే కోమలి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో దర్శకుడు ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది.