విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం కచ్చితమైన వైఖరితో ఉంది. నూటికి నూరుశాతం ప్రైవేటీకరణ జరిపి తీరుతామంటోంది. అదే సమయంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్ర బీజేపీ ఉక్కు ప్రైవేటీకరణ సమంజసమేనంటున్న సమయంలో జనసేన మాత్రం అటు మద్దతివ్వలేక, ఇటు వ్యతిరేకంగా పోరాటం చేయలేక ఇబ్బంది పడుతోంది. ఈ దశలో చిరంజీవి ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకించడం పవన్ కల్యాణ్ కి కలిసొచ్చే అంశమా లేదా అనేది తేలాల్సి ఉంది.