ఎప్పటి లాగే ఎన్నికల అనంతరం వాటి ఫలితాలు ఏవిధంగా ఉండనున్నాయని రక రకాల సర్వేలు తమ తమ సర్వేలను వెల్లడించడం మనము చూస్తూనే ఉన్నాము. అదే విధంగా నిన్న ముగిసిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆత్మసాక్షి అనే సంస్థ సర్వే ని బయట పెట్టింది. ఇందులో మునిసిపాలిటీల్లో ఇచ్చిన సర్వే ఫలితంలో స్పష్టంగా వైసీపీ గెలుస్తుందని అంచనాలు వేశారు.