ప్రేమ ఇద్దరిని ఒక్కటి చేసింది. ఒక్కరంటే మరొక్కరికి పంచ ప్రాణాలు. వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక వరుసకు ఆ ఇద్దరు బంధువులు అవుతారు. వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో.. అంతా కలిసి వాళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అంతలోనే అబ్బాయి మనసు మారింది. ప్రేమ స్థానంలో అతడిలో కొత్త కోరికలు చిగురించాయి.