పట్టుమని 15 ఏళ్లు కూడా రాకముందే.. మత్తుకు బానిసవుతోంది బాల్యం. చక్కగా బడికి వెళ్లి చదువుకోవాల్సిన వాళ్లు… గంజాయి మత్తులో పడి చదువుకు డుమ్మా కొడుతున్నారు. అలాంటి ఇద్దరి విద్యార్థుల గుట్టురట్టైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లిలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తుండగా స్థానికులు గుర్తించి పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు.