తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎదుట పాలాభిషేకాలు జరుగుతున్నాయి. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు కార్మికులు. అదే సమయంలో సీఎం జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన మద్దతు ప్రకటన మరింత సంచలనంగా మారింది. చివరకు జగన్ పై వ్యతిరేకత పెంచేలా చేసింది.