తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటున్న షర్మిల అక్కడ పార్టీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. అంటే వైఎస్సార్టీపీ అనే పేరుతో పార్టీ ప్రకటిస్తారని అంటున్నారు. అయితే ఏపీలో వైఎస్సార్సీపీ ఉండగా, దాన్ని పోలినట్టు వైఎస్సార్టీపీ అనే పార్పీ పెడితే సీఎం జగన్ ఊరుకుంటారా? తెలంగాణలో పార్టీ పెట్టొద్దంటూ చెల్లెలిని వారించిన ఆయన, తన పార్టీ పేరుకున్న ఇమేజ్ ని తెలంగాణలో వాడుకుంటానంటే ఒప్పుకుంటారా..? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది.