మానవుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న రోజులు ఇవి. కానీ మానవుడి ఆలోచనలు మూఢనమ్మకాలకే పరిమితమైయ్యాయి. తూర్పు మన్యంలో దారుణం జరిగింది. మూఢనమ్మకాలు గిరిజనుల ప్రాణాలు తీసింది. వైద్య సాంకేతికత పెరిగినా ఏజెన్సీలో చేతబడి హత్యలు ఆగడం లేదు. ఏటపాక మండలం అయ్యవారిపేటలో చేతబడి చేశారనే నెపంతో సొంత బాబాయిని హతమార్చారు ఇద్దరు వ్యక్తులు.