డ్రంకెన్ డ్రైవ్ తో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో లెక్కే లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అజాగ్రత్త వల్ల జరిగేవి కొన్ని అయితే, మందుబాబులు బండ్లు నడపడం వల్ల జరిగేవి మరికొన్ని. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లుచేపడుతున్నా, నిబంధనలు కఠినతరం చేస్తున్నా ఈ పరిస్థితిలో మార్పు లేదు. అయితే ఇప్పుడు దీనికి మరో కొత్త నిబంధన అదనంగా చేర్చారు అధికారులు. బండి తాగి నడిపితే డ్రైవర్ తోపాటు, ప్రయాణికులపై కూడా కేసు నమోదు చేయబోతున్నారు. అంటే డ్రైవర్ బండి నడిపే ముందు తాగి ఉన్నాడా లేక, మామూలుగా ఉన్నాడా అని చెక్ చేసుకోవడం ఇకపై ప్రయాణికుల బాధ్యత కూడా.