కొత్త కొత్త యాప్ లతో దారుణాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళపై ఎక్కువగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. యాప్ లతో వీడియో కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. టెక్నాలజీని ఉపయోగించి కొందరు ప్రబుద్ధులు దారుణాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్త తరహా యాప్ల వెనుక చైనీయుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ యాప్లు ఇప్పుడు సైబర్నేరగాళ్లకు ఆయుధంగా మారాయి. దాంతో పెచ్చు మీరి ప్రవర్తిస్తున్నారు.