వేసవిలో కొన్ని రకాల వస్తువుల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ఆ వాస్తవం తెలిసినా కూడా ఆ టైమ్ వచ్చే వరకు ఎవరూ వాటి జోలికి పోరు. ఎండా కాలంలో ఫ్రిజ్ లు, ఏసీల ధరలు అమాంతం పెరిగిపోతాయి. అదే అన్ సీజన్ అయిన చలికాలంలో వాటి ధరలు కాస్త అదుపులో ఉంటాయి. అయినా కూడా అందరూ వేసవిలోనే ఏసీలు, ఫ్రిజ్ లు కొంటుంటారు. అవసరం ఉన్నప్పుడే వాటిని కొనాలని అనుకుంటారు. అయితే ఈ వేసవిలో ఏసీల రేట్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాదాపుగా 10నుంచి 20 శాంత వరకు రేట్లు పెరుగుతాయని అంటున్నారు.