ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి 14 వతేదీతో ముగియనుంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు 14 వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ కూడా నేటితో ముగియనుంది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. అయితే ఇప్పటికే ఇటు ప్రజల్లో అటు పార్టీ శ్రేణుల్లో ఫలితాలపై ఒక అంచనాకి వచ్చి ఉంటారు. ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన విధంగానే ఈసారి కూడా వైసీపీనే విజయ బావుటా ఎగరవేస్తుందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.