ఏపీలో చిన్న పిల్లలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించి.. అన్ని రకాల ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించాలనేది సీఎం జగన్ కల. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని గతంలోనే ఆయన అధికారులకు సూచించారు. తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నంలో చిన్న పిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలనే ప్రతిపాదనలు గతంలో కూడా జరిగాయి. అయితే ఇందులో బాగంగా తొలిసారి తిరుపతిలో ఇలాంటి ఆస్పత్రి నిర్మాణం మొదలు కాబోతోంది.