విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీపై అసంతృప్తి పెరిగిపోతోంది. అటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి అదనపు కేటాయింపులు లేకపోవడం, విభజన హామీలను సైతం అటకెక్కించేయడం కూడా బీజేపీపై వ్యతిరేకత పెంచుతోంది. ఇక పెట్రోలు, వంటగ్యాస్ ధరల పెంపుతో బీజేపీ ప్రభుత్వం అంటేనే మండిపడుతున్నారు సామాన్య ప్రజలు. ఈ దశలో బీజేపీ ఏపీలో ఎక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్ దక్కదు. బీజేపీతో కలసి ఏ పార్టీ పోటీ చేసినా కూడా దాని భవిష్యత్తు కూడా అంతే. అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీనుంచి విరమించుకుంది. పొత్తులో భాగంగా ఆ అవకాశాన్ని బీజేపీకే వదిలిపెట్టింది.