పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం శూన్యం అని మరోసారి రుజువు కాబోతోంది. సహజంగా ఈ ఎన్నికల్లో ఆయా ఉద్యోగ సంఘాల తరపున బరిలో దిగే నేతలే గెలుపొందుతారు. అందులోనూ రాజకీయ పార్టీల ప్రభావం వారిపై ఉండదు. స్వతంత్ర అభ్యర్థులుగా లేదా, పీడీఎఫ్ పార్టీ తరపున వారు పోటీలో ఉంటారు. సహజంగానే వారికి వామపక్షాల మద్దతు ఉంటుంది. ఇక ఈ దఫా కూడా ఏపీలోని రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రభావం శూన్యం అని తేలిపోయింది.