తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలపై బీజేపీ, టీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ తరపున కేటీఆర్ అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే అదే సమయంలో ఆయన సెటిలర్ల ఓట్లకోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాస్త కలకలం రేపాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కేటీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టాయి. మూతపడిన అజంజాహీ మిల్లు, నిజాంషుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరిపించడంలేదని ప్రశ్నించారు. ముందు తెలంగాణ సంగతి చూసుకుని, ఆ తర్వాత ఏపీకి మద్దతివ్వాలని హితవు పలికారు.