ఇటీవల కాలంలో బీజీపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏపీలో పర్యటించడం, సీఎం జగన్ ను కలసిన ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడటం, తిరుపతి కోర్టులో ఏబీఎన్ పై రూ.100కోట్ల పరువునష్టం దావా వేస్తున్నానని చెప్పడం.. కలకలం రేపాయి. అయితే ఆ తర్వాత ఏబీఎన్, సుబ్రహ్మణ్య స్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. స్వామి సైలెంట్ గా ఉన్నా.. ఆయనపై ఏబీఎన్ లో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకోసమే ఏబీఎన్ ను టార్గెట్ చేశారని అంటోంది యాజమాన్యం. దానికి రుజువుగా కథనాలు ప్రచురిస్తోంది.