హిందూ సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. మానవ నిర్మితాలైన ఆలయాలు.. స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాలు అనేక మర్మాలను కలిగి ఉన్నాయి. కానీ నేటికీ ఎన్నో ఆలయాల్లోని రహస్యాలను తెలుసుకోవడం మాత్రం వీలుకావడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామందగ్గర అడవుల్లో కొలువై ఉన్నాడు హేమాచల నరసింహస్వామి.