తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని జనసేన కార్యకర్తలు మొదటి నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటిస్తూ వస్తోంది. అవసరమైతే ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసి ఒప్పిస్తామని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ బలం ఉందని, తమకు అవకాశం ఇస్తే తిరుపతి సీటును గెలుచుకుంటామని చెప్తూ వచ్చింది. ఈ తరుణంలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి నిలబెడతామని పవన్ కల్యాణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది..