ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాసింత ఆసక్తి కనబరుస్తున్నా.. చాలా వరకు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.