తిరుపతి ఉప ఎన్నికల వేళ బీజేపీ రథయాత్రకు సిద్ధమవుతున్నట్టు చెప్పింది. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు అంటూ మొదలు పెడుతున్న ఈ యాత్ర గతంలోనే జరగాల్సి ఉన్నా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని కాదని, బీజేపీ బరిలో దిగుతోంది. దీంతో మరోసారి రథయాత్ర అంశం ప్రస్తావనకు వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల లోపే దీన్ని మొదలు పెట్టాలని, ఉప ఎన్నికల్లో తమ ప్రచారానికి యాత్రను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు బీజేపీ నేతలు.