గుజరాత్లోని నరోలిలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. హత్య చేశాడో కిరాతకుడు. అనంతరం పాప మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టి బాత్రూం కిటికీ నుంచి బయటకు విసిరాడు. తమ బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణాన్ని తట్టుకోలేక చిన్నారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి కుటుంబం దాద్రా నగర్ హవేలీ నరోలి గ్రామ సొసైటీలో నివాసముంటోంది. ఆడుకోవడానికి వెళ్లిన పాప చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు...