కర్నాటక రాసలీలల సీడీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. కీలక ఆధారాలు సేకరిస్తోంది. సీడీ టీవీ ఛానెళ్లకు వెళ్లే ముందే సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ కావడంతో దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు సిట్ పోలీసులు. యూట్యూబ్ లో వీడియోలు రష్యానుంచి అప్ లోడ్ చేసినట్టు ఉండటంతో అసలీ వ్యవహారానికి రష్యాకు సంబంధం ఏంటని ఆరా తీస్తున్నారు. అయితే శ్రవణ్ అనే వ్యక్తి యూట్యూబ్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేసి రష్యానుంచి అప్ లోడ్ చేసి ఉంటారని, లేదా.. రష్యాలో ఉన్న సన్నిహితుల ద్వారా ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.