ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సినేషన్ రెండోదశకు చేరుకుంది. సామాన్య ప్రజలకు టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. 60ఏళ్లుపైబడిన వృద్ధులు, 45ఏళ్లుపైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, జర్నలిస్ట్ లు.. ఇలా రకరకాల కేటగిరీల వాళ్లకు టీకాలు వేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వీటి వినియోగం పెరిగింది. ప్రస్తుతం భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ కొవిషీల్డ్ టీకాలు వేస్తున్నారు. ఇకపై మరికొన్ని కొత్త రకాలు వీటితో జతకలవబోతున్నాయి.