పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సరికొత్త సమాజాన్ని రూపకల్పన చేయాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయులు వారంతా. కానీ వారికి దురాశ పుట్టింది. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే యావ కలిగింది. చేస్తున్న వృత్తి కూడా వారి ఆలోచనలను మార్చలేకపోయింది. ఇంకేముంది.. డబ్బుసంపాదనకోసం అడ్డదారులు తొక్కారు. అడ్డంగా బుక్కయ్యారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి ఏపీలో అమ్ముతున్న నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.