ప్రస్తుత కాలంలో వైద్యం చేయించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. జబ్బు, దగ్గు, జ్వరం వచ్చిందంటే చాలు వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద జబ్బు వస్తే లక్షలు గుమ్మరించాల్సిందే. బతకడానికి ఆశలో ధనవంతులు లక్షలు గుమ్మరిస్తే.. పేదవాడికి మాత్రం ఒక్కింత నిరాశే మిగులుతోంది. డబ్బులు లేకపోవడంతో ఆరోగ్య సమస్య ఉన్నా.. అనారోగ్యంతో పోరాడుతూ.. చివరికీ ప్రాణాలు విడుస్తున్నాడు.