ఒడిస్సా రాష్ట్రం మయూరభంజ్ కి చెందిన సుశీల్ అగర్వాల్ అనే ఓ రైతు కరోనా సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు తన సొంత వర్క్ షాప్ లో పని చేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనే ఒక కారు తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తనకు వచ్చింది. వెంటనే తాను తన ఆలోచనను కార్యాచరణలో పెట్టి 850 వాట్స్ మోటారుతో 100 ఆహ్/ 54 వోల్టుల బ్యాటరీతో ఒక కారు తయారు చేశారు. మోటార్ వైండింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, చట్రం అమర్చడం వంటి పనులు అన్నీ కూడా తన వర్క్ షాప్ లోనే పూర్తి చేశామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ కారు హాట్ టాపిక్ అయ్యింది.