ఎన్నికల ఫలితాలను టీడీపీకి మరణ శాసనంగా అభివర్ణిస్తున్న కొందరు మంత్రులు.. అంతేకాదు.. ఏకంగా చంద్రబాబు టార్గెట్ చేస్తూ మాటల బాణాలు వదులుతున్నారు. ఈ ఫలితాలతో చంద్రబాబు అమరావతి ఉద్యమానికి బలం లేదని తేలిపోయిందంటున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి చంద్రబాబు ఏకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే అడుగు పెట్టొద్దంటున్నారు.