అమరావతి రైతులను తెలుగుదేశం తప్పుదోపట్టించిందని.. అమరావతి రైతులు సీఎం జగన్ ను కలిస్తే న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. అవసరమైతే తాము మధ్యవర్తిత్వం చేస్తామంటున్నారు మంత్రి కొడాలి నాని. అమరావతిలో ఉన్న నిజమైన రైతులు ఇప్పటికైనా ఆలోచించాలని.. పరిపాలన రాజధానిగా అమరావతిని సీఎం జగన్ కొనసాగిస్తారని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు.